మాంసాహార విందు! | - | Sakshi
Sakshi News home page

మాంసాహార విందు!

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

అల్ట్రాసౌండ్‌ గదిలో..

● పది రోజులైనా చర్యలు శూన్యం

● గుణుపూర్‌ ఆస్పత్రిలో వైద్యుడి వ్యవహారంపై విమర్శలు

రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌ సబ్‌ డివిజన్‌ ఆస్పత్రిలోని అల్ట్రాసౌండ్‌ గదిలో గాంధీ జయంతి నాడు మాంసాహార విందు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చి పది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై జిల్లా యంత్రాంగం, ఆస్పత్రి అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏం జరిగిందంటే..

అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా గుణుపూర్‌ సబ్‌ డివిజన్‌ ఆస్పత్రిలో అల్ట్రా సౌండ్‌ గదిలో గైనకాలజీ నిపుణుడు డాక్టర్‌ సందీప్‌కుమార్‌ స్వైన్‌, మరికొందరు మాంసాహార విందు చేసినట్లు తెలిపే దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయని ఓ పత్రిక కథనంలొ పేర్కొంది. డాక్టర్‌ స్వైన్‌ ప్రధాన కుర్చీలో కూర్చొని మాంసం పకోడీ తింటున్నట్లు కనిపించినట్లు తెలిపింది.

గతంలోనూ వివాదమే..

గుణుపూర్‌లో 2024 నవంబరు 27న వెలుగుచూసిన నవజాత శిశువు అక్రమ దత్తత వ్యవహారంలోనూ డాక్టర్‌ స్వైన్‌ పేరు వివాదంలోకి వచ్చిందని కథనం పేర్కొంది. సంతానం లేని దంపతులు ఓ శిశువును దత్తత తీసుకోవడం, గర్భం దాల్చని మహిళ ఆ శిశువుకు జన్మనిచ్చినట్లు చూపించే తప్పుడు పత్రాలు రూపొందించారనే ఆరోపణలు వచ్చాయని తెలిపింది. ఈ కేసులో వైద్యుడితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైనట్లు తెలిపింది.

అధికారుల స్పందన కరువు..

గతంలో వివాదానికి కారణమైన వ్యవహారంతో పాటు తాజాగా ఆస్పత్రిలోని అల్ట్రాసౌండ్‌ గదిలో మాంసాహార విందు జరిగినట్లు ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పది రోజులైనా ఎలాంటి చర్యలు కనిపించకపొవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై స్పందన కోరగా సంబంధిత వ్యవహరం కోర్టులొ విచారణలో ఉందని డాక్టర్‌ స్వైన్‌ సమాధానమిచ్చినట్లు కథనం పేర్కొంది. అయితే అల్ట్రాపౌండ్‌ గదిలో విందు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఆస్పత్రి యాజమాన్యం లేదా జిల్లా యంత్రాంగం అధికారికంగా ఎలాంటి చర్యలు తీసకుందనే వివరాలు వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement