గురువారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

న్యూస్‌రీల్‌

భువనేశ్వర్‌:

జగన్నాథుని క్షేత్రం పూరీ అంటే రథయాత్ర ఒక్కటే కాదు ... శతాబ్దాలుగా కొనసాగుతున్న ఎన్నో విశిష్ట ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు నిలయం. వాటిలో ప్రత్యేకమైనది గోషాణి యాత్ర. దసరా వేళ పూరీ వీధులు అమ్మవారి విభిన్న రూపాలతో కళకళలాడుతాయి. సాధారణంగా ఇతర ప్రాంతాల్లో దుర్గాదేవిని లక్ష్మీ, సరస్వతి, గణేశుడు, కార్తికేయుడితో కూడిన సమూహ రూపంలో ప్రతిష్ఠిస్తారు. పూరీలో మాత్రం మహిషాసురమర్దిని అమ్మవారిని ప్రత్యేకమైన జానపద శిల్పరీతిలో తీర్చిదిద్ది, ‘గోషాణి’గా కొలుస్తారు. స్థానిక వీధులు, సంప్రదాయాలు, జానపద విశ్వాసాలతో ముడిపడిన ఈ వేడుక పూరీ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

ఆశ్వయుజ మాసంలో ఆరంభం..

ఆశ్వయుజ మాసంలో దుర్గా పూజ సందర్భంగా గోషాణి విగ్రహాలను ఆయా వీధుల్లో ప్రతిష్ఠించి పూజిస్తారు. విజయదశమి నాటికి ఉత్సవాలు ప్రత్యేక శోభను సంతరించుకుంటాయి. విజయదశమి అనంతరం ఏకాదశి రోజున వివిధ వీధుల్లోని గోషాణి విగ్రహాలు ఊరేగింపుగా శ్రీమందిరం సింహద్వారం సమీపానికి చేరుకుంటాయి. అనంతరం సంప్రదాయబద్ధంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే అన్ని విగ్రహాల నిమజ్జనం ఒకే రోజున జరగదు. ప్రముఖ గోషాణి విగ్రహమైన కాకుడిఖాయి అమ్మవారిని విజయదశమి రోజునే నిమజ్జనం చేయడం ప్రత్యేక సంప్రదాయం. మిగిలిన గోషాణి విగ్రహాల్లో అనేకం ఏకాదశి రోజున నిమజ్జనానికి తరలిస్తారు.

ఎన్ని విగ్రహాలంటే..

పూరీలోని వివిధ సాహీలు (వీధులు), అఖాడాలు (యుద్ధ విన్యాస వర్గాలు) తమ తమ సంప్రదాయాల ప్రకారం గోషాణి విగ్రహాలను ప్రతిష్ఠిస్తాయి. ప్రతి వీధికి చెందిన అమ్మవారికి ప్రత్యేక నామం, రూపం, అలంకరణ ఉండటం ఈ యాత్రలోని విశిష్టత. కాకుడిఖాయి, బారాబతి, జొహ్నిఖాయి, జొహ్నిముండియా, శూన్య గోషాణి, హడొబాయి, గెల్లొబాయి, బెల్లొబాయి,

పూరీ వీధుల్లో శక్తి స్వరూపిణుల కొలువు

జగన్నాథుని సన్నిధిలోకి

సోదరీమణులు

జానపద సంప్రదాయానికి

సజీవ సాక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement