కళాశాలల్లో ఎన్నికల సందడి | - | Sakshi
Sakshi News home page

కళాశాలల్లో ఎన్నికల సందడి

Oct 11 2026 1:22 PM | Updated on Oct 11 2026 1:22 PM

కొరాపుట్‌: ఎనిమిదేళ్ల అనంతరం కళాశాలల్లో విద్యార్థి సంఘాలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంతో సందడి ఏర్పడింది. కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాల్లో నామినేషన్లు వేయడం ప్రారంభించారు. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ, బీజేడీ విద్యార్థి విభాగం, కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలు తమ ఉనికిని కాపాడుకోవడానికి అభ్యర్థులను రంగంలోనికి దించుతున్నాయి. అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో ఏకై క యునివర్సిటీ అయిన జయపూర్‌ విక్రందేవ్‌ విశ్వ విద్యాలయంలో కోలాహల వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికల నేపథ్యంలో వివాదాలు జరగకుండా ఉండడానికి పోలీసులు పెద్ద ఎత్తున మెహరించారు. జయపూర్‌ ఎస్‌డీపీఓ అర్చనా మిట్టల్‌ స్వయంగా యునివర్సిటీ ప్రాంతంలో మకాం వేశారు. గుర్తింపు కార్డులు లేని వారిని క్యాంపస్‌లోనికి అనుమతి ఇవ్వడం లేదు. సమస్యలు ఉంటే తనను నేరుగా సంప్రదించాలని అర్చనా మిట్టల్‌ ప్రకటించారు.

మరోవైపు నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో ప్రతిపక్ష బీజేడీ తన విద్యార్థి విభాగం తరఫున అభ్యర్థులను పోటీలో దింపింది. నబరంగ్‌పూర్‌ కాలేజ్‌లో ప్రెసిడెంట్‌గా రోహన్‌ కుమార్‌ బిసోయి బరిలో దిగారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. కొరాపుట్‌ డీఏవీ కాలేజ్‌లో పోటీలో దిగిన అత్యధిక అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. దీంతో అభ్యర్థులు ఆందోళనకి దిగారు. పోటీ చేసే వారిలో అత్యధికులు క్లాసులకు హాజరుకావడం లేదు. సరైన హాజరు పోవడంతో ఏన్నికల అధికారులు తొలగించారు. సిమిలిగుడ కాలేజ్‌ వద్ద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement