మహాలయ వేళ ధవళముఖి | - | Sakshi
Sakshi News home page

మహాలయ వేళ ధవళముఖి

Oct 11 2026 1:22 PM | Updated on Oct 11 2026 1:22 PM

భువనేశ్వర్‌: మహాలయ అమావాస్య సందర్భంగా ఒడిశాలోని బొలంగీర్‌, సంబల్‌పూర్‌ ప్రాంతాల్లో కొలువైన మా సమలేశ్వరి దేవి ధవళముఖి అలంకరణలో భక్తులకు దర్శనం ప్రసాదించడం విశేషం. ఏడాదికోసారి జరిగే ఈ ప్రత్యేక అలంకరణలో అమ్మవారు తెల్లని ముఖవర్ణంతో దర్శనం ప్రాప్తిస్తుంది. శక్తిస్వరూపిణి అయిన సమలేశ్వరి దేవిని ఈ రూపంలో దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతారు. ధవళముఖి అలంకరణను గంగా దర్శన అలంకరణ అని కూడా పిలుస్తారు. ఈ అలంకరణలో అమ్మవారిని గంగా మాత స్వరూపంతో అనుసంధానిస్తారు. ధవళముఖి రూపంలో దేవిని దర్శించుకోవడం గంగానదిలో పవిత్ర స్నానం చేసిన పుణ్యఫలాన్ని అందిస్తుందని భక్తుల విశ్వాసం. తెల్లని వర్ణం పవిత్రతకు ప్రతీకగా నిలిచే ఈ అలంకరణ మహాలయ అమావాస్యకు ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని చేకూరుస్తుంది. మహాలయ పర్వదినాన సమలేశ్వరి దేవి ధవళముఖి దర్శనం ఒడిశా భక్తి సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ దర్శనం చేసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement