భక్తిశ్రద్ధలతో పోలేరు అమావాస్య పూజలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో పోలేరు అమావాస్య పూజలు

Oct 11 2026 1:22 PM | Updated on Oct 11 2026 1:22 PM

రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని శ్రీకళ్యాణవేంకటేశ్వర మందిరం ప్రాంగణంలో శనివారం పోలేరు అమావాస్యని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పువ్వులు, పండ్లు తదితర పూజా సామగ్రితో అమ్మవారిని ఆరాధించి కుటుంబ శ్రేయస్సు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్ధించారు.

సమలేశ్వరి ఆలయాన్ని సందర్శించిన గవర్నర్‌ దంపతులు

మహాలయ సందర్భంగా శనివారం రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరి బాబు కంభంపాటి సతీసమేతంగా సంబల్‌పూర్‌లోని మా సమలేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఒడిశా ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం ప్రార్థించినట్లు తెలిపారు. – భువనేశ్వర్‌

ప్రముఖ వైద్యుడు రఘునందన్‌

మహారణ కన్నుమూత

రాయగడ: రాయగడ ప్రాంతంలో వైద్య సేవలందిస్తూ ప్రజల ఆదరాభిమానాలను పొందిన విశ్రాంత వైద్యుడు, రిటైర్డు జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్‌ రఘునందన్‌ మహారణ (87) కున్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక న్యూకాలనీలోని తన నివాసంలోనే చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో స్థానికంగా విషాదం నెలకొంది. అతనికి కుమారుడు ఉన్నారు.

స్కూటీ దగ్ధం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి కేంద్రంలో హైస్కూల్‌ వీధిలో ఇంటి వద్ద నిలిపి ఉన్న ఓ స్కూటీలో శుక్రవారం అర్ధరాత్రి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో పాటు స్కూటీ నిలిపిన స్థలాంలో ఉన్న దుకాణంలోని సామగ్రి కూడా ధ్వంసమైంది. దుకాణానికి మంటలు వ్యాపించి ఫ్రిజ్‌, గ్యాస్‌ స్టవ్‌ ఇతర సామగ్రి కాలిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement