పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రంగంలో ‘కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ ఆవర్తనాలు’ అనే అంశంపై గత రెండువారాలుగా నిర్వహించిన అధ్యాపక అభివృధ్ధి కార్యక్రమం శనివారంతో ముగిసింది. కార్యక్రమంలో ఎన్‌ఐటీ పాట్న, సెంచూరియన్ వర్సిటీ పర్లాకిమిడి సంయుక్తంగా నిర్వహించారు. దీనికి భారత ప్రభుత్వ సాంకేతిక సమాచార మంత్రిత్వ శాఖ సహకరించింది. ముగింపు వేడుకల్లో ఎన్‌ఐటీ వరంగల్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ పట్నాయిక్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఉపన్యాసం ఇచ్చారు. ఎఫ్‌డీపీ సమన్వయ కర్త డాక్టర్ ప్రజ్ఞా పరమితా ప్రధాన్ స్వాగత ఉపన్యాసం చేయగా, ఇంజినీరింగ్ స్కూల్, స్కూల్‌ఆఫ్ కంప్యూటర్, డేటా సైన్స్ డీన్ డాక్టర్ ప్రఫుల్ల కుమార్ పండా, రిజిస్ట్రార్ డాక్టర అనితాపాత్రో, పాల్గొన్నారు. అనంతరం విశిష్ట అతిథులను సత్కరించారు.


