పితృ పక్షం ముగింపు.. దేవీ పక్షం ఆరంభం | - | Sakshi
Sakshi News home page

పితృ పక్షం ముగింపు.. దేవీ పక్షం ఆరంభం

Oct 11 2026 1:22 PM | Updated on Oct 11 2026 1:22 PM

భువనేశ్వర్‌: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పవిత్ర మహాలయ అమావాస్య పురస్కరించుకుని శనివారం పూర్వీకులకు నివాళులర్పించేందుకు పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలను నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వీకుల ఆశీస్సులు కోరుతూ, వారికి శ్రాద్ధకర్మ, తిల తర్పణం, పిండప్రదానం పూజాదులతో కొలనులు, పుష్కరిణిలు ఇతరేతర పవిత్ర జలాశయాల తీరాలు కిటకిటలాడాయి. ప్రధానంగా పూరీ, భువనేశ్వర్‌ ప్రాంతాల్లో ఈ సందడి అధికంగా తారసపడింది. భువనేశ్వర్‌లో బిందు సాగర్‌ మహాలయ పితృ కార్యాలకు పేరొందింది. అమావాస్యతో మహాలయ పితృ పక్షం ముగిసి దేవీ పక్షం ఆరంభమైంది. ఈ సమయం దుర్గాదేవి ఆగమనానికి, శక్తి ఆరాధనకు సంకేతంగా భావిస్తారు.

19 మంది వైద్యుల నియామకం

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పలు ఆయుష్‌ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత నివారించేందుకు తన సిఫారసుతో జిల్లాలో 19 మంది డాక్టర్లను ప్రభుత్వం నియమించినట్టు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు అన్నారు. పర్లాకిమిడి డోలా ట్యాంకు రోడ్డులో ఉన్న బీజేపీ కార్యాలయంలో కోడూరు నారాయణ రావు తన పార్టీ అనుచరులతో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆదివాసీ బహుళ ప్రాంతమైన గజపతి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత వల్ల ప్రజలు పొరుగు రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం వెళ్లి ప్రభుత్వ ఆయుష్మాన్‌ ఆరోగ్య కార్డుల ద్వారా జబ్బులకు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు. అయినా నాణ్యమైన వైద్యం అందటంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పర్లాకిమిడి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి నలుగురు స్పెషలిస్టులు, ఇతర ఆయుష్‌ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 15 మంది డాక్టర్లు ఈ నెల 16 తరువాత విధుల్లో చేరుతారన్నారు. త్వరలోనే మరికొంత మంది డాక్టర్లను భర్తీ చేస్తామన్నారు. బీజేపీ సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, కౌన్సిలరు, బీజేపీ యువజన నాయకులు బాలకృష్ణ పాత్రో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement