బంద్‌ విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

బంద్‌ విజయవంతం చేయండి

Oct 7 2026 2:04 AM | Updated on Oct 7 2026 2:04 AM

బంద్‌ విజయవంతం చేయండి

కొరాపుట్‌: ఈనెల 8న ఇండియా కూటమి నిర్వహించే బంద్‌ విజయవంతం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జయపూర్‌ ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినీపతి మీడియాతో మాట్లాడారు. ఆరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగే బంద్‌ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అవిభక్త కొరాపుట్‌ జిల్లాల స్థాయిలో ప్రభుత్వ గ్రూప్‌ 3, 4 కేటగిరీలకు ఉద్యోగాల నియామాకాలు చేయాలన్నారు. అందుకు ఈ ప్రాంత జెన్‌–జీ యువత బంద్‌లో మమేకం కావాలని కోరారు. మరోవైపు కొరాపుట్‌ జిల్లా సునాబెడా పట్టణంలో ప్రెస్‌క్లబ్‌ లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు, పొట్టంగి ఎమ్మెల్యే రాం చంద్రఖడం మాట్లాడారు. ఈ ప్రాంతంలో గనులు అక్రమం తవ్వుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఎంఎండీఆర్‌ బిల్లుకి వ్యతిరేకంగా గిరిజనులు బంద్‌లో పాల్గొనాలని కోరారు. అనంతరం బంద్‌కి సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు. కార్యక్రమంలో కొరాపుట్‌ డీసీసీ ప్రెసిడెంట్‌ రుపక్‌ తురుక్‌ పాల్గొన్నారు. అలాగే నబరంగ్‌పూర్‌ మెయిన్‌ రోడ్డులోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బంద్‌ పోస్టర్‌ని కాంగ్రెస్‌ నాయకులు విడుదల చేశారు. జయపూర్‌కి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు దుర్గా ప్రసాద్‌ శర్మ ప్రత్యేక పరిశీలకుడుగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నబరంగ్‌పూర్‌ జిల్లాలో బంద్‌ విజయవంతం చేయడానికి కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు లిఫికా మజ్జి, కాంగ్రెస్‌ నాయకులు మున్నా త్రిపాఠి, భుజబల్‌ మజ్జి, శివరాం రాజు తదితరులు పాల్గొన్నారు.

పర్లాకిమిడి: ఎంఎండీఆర్‌ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 8న గజపతి జిల్లావ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు స్థానిక సొండివీధి వద్ద కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ప్రధాన్‌, జిల్లా సాధారణ కార్యదర్శి జాస్మిన్‌ బేక్‌, ఇతర పార్టీ నాయకులను కలుసుకుని మాట్లాడారు. సమావేశంలో గుసాని సమితి కాంగ్రెస్‌ అధ్యక్షుడు అప్సాన శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బసంత పండా, మాజీ కౌన్సిలర్‌ అభిమన్యు పండా, శిర్ల పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement