దూసుకొచ్చిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Oct 7 2026 2:04 AM | Updated on Oct 7 2026 2:04 AM

దూసుకొచ్చిన మృత్యువు

● టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఇద్దరు మృతి

● మరో ఇద్దరికి తీవ్రగాయాలు

పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్‌ బడగాం గ్రామం వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమారంలో ఇద్దరు సంఘటనా స్థలం వద్దే మృతి చెందారు. మరో ఇద్దరకు తీవ్రంగా గాయపడి పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. రాయఘడ బ్లాక్‌ గండాహతి పంచాయతీ నుంచి ఖాళీగా తిరిగి వస్తున్న ఇసుక టిప్పర్‌ అతి వేగంతో(నిర్లక్ష్యంగా) బడగాం జంక్షన్‌ వద్ద ఆగి ఉన్న ఒక పినాయిల్‌ అమ్ముతున్న ఆటోను ఢీకొంది. ఆటో తుప్పల్లోకి ఎగిరి పడింది. అనంతరం అక్కడ ఉన్న ఒక కిరాణా కొట్టులోకి టిప్పర్‌ దూసికెళ్లడంతో ఇద్దరు చిల్లర దుకాణదారులు బి.షణ్ముఖరావు (56), బడగాం గ్రామానికి చందిన ఎస్‌.కనకనాభం కుమారుడు ఎస్‌.వేణుగోపాల్‌ (43) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్‌ (నరహరిపురం) పి.ఎస్‌.పి.కుమార్‌ (35), ఆటోలో ఉన్న ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. 108 లో పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంలో శ్రీకాకుళానికి తరలించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనతో బడగాం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని క్షతగాత్రుల కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బడగాం గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి రాయఘడ పోలీసులు వచ్చి ఆందోళనకారులను సర్దిచెప్పారు. రాయఘడ ఐఐసీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement