బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Oct 7 2026 2:04 AM | Updated on Oct 7 2026 2:04 AM

ఖోయిర్‌పూట్‌లో సేవసేతు కార్యక్రమం

మల్కన్‌గిరి: జిల్లా ముఖ్య వైద్యాధికారిగా డాక్టర్‌ మానస్‌ రంజన్‌ పండా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రి కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఆబిద్‌ హూస్సేస్‌ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇదివరకు డాక్టర్‌ మానస్‌ రంజన్‌ పండా బ్రహ్మపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆరోగ్య అధికారిగా విధులు నిర్వహించారు. ఆయనకు డీపీఎం మౌసుమీ మిశ్రా తదితరులు స్వాగతం పలికారు.

సెంచూరియన్‌ వర్సిటీలో వర్క్‌షాప్‌

పర్లాకిమిడి: సెంచూరియన్‌ వర్సిటీ క్యాంపస్‌లో మంగళవారం మెట్‌ల్యాబ్‌, సిమ్యూలింక్‌ వర్క్‌షాప్‌ను ఈసీఈ, ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అధ్యాపకులు ప్రొ.ప్రభాత్‌ కుమార్‌ పట్నాయిక్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. డాటా ప్రాసెసింగ్‌, కర్వ్‌ ఫిట్టింగ్‌, మెట్‌లాబ్‌ అప్లికేషన్స్‌, ఎల్‌మాస్‌ సిస్టమ్స్‌ ఎలా పనిచేస్తాయో అధ్యాపకులు విద్యార్థులకు కర్మశాలలో బోధించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ ప్రొ.దినేష్‌ కుమార్‌, ప్రొ.ఎన్‌.జీవరత్నం, డా.అనిష్‌ రాజన్‌ షడంగి, డా.అరబిందో బాగ్‌, డా.రిబూ అబూసన్‌ పండా, ప్రొ.ఎస్‌.ఎన్‌.పాఢి తదితరులు పాల్గొన్నారు.

మల్కన్‌గిరి: జిల్లాలోని ఖోయిర్‌పూట్‌ సమితి స్థాయిలో సేవసేతు కార్యక్రమంతో పాటు ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం మంగళవారం నిర్వహించారు. మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్‌ మాడ్కామి, కలెక్టర్‌ ప్రథమేశ్‌ అర్వింద్‌ రాజాశిర్కే, పంచాయతీ సమితి అధ్యక్షుడు విఘ్ను కిర్షానీ, చిత్రకొండ మాజీ ఎమ్మెల్యే డొంబురు సీసా, ఖోయిర్‌పూట్‌ సమితి అధ్యక్షురాలు అర్పితా మహంతి తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే నర్సంగ్‌ మడ్కామి మాట్లాడుతూ.. ప్రతీ పౌరుడికీ అభివృద్ధి ఫలాలు అందజేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బ్యాటరీ బైక్‌లు, ఫోల్డింగ్‌ వీల్‌చైర్‌, టీఎల్‌ఎం కిట్‌, సుగమ్య కర్ర, వితంతు లబ్ధిదారుకి రూ.20 వేల చెక్కు అందజేశారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు రూ.5.5 లక్షల రుణాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement