టెక్కలి: మేజర్ పంచాయతీలో వైఎస్సార్ జంక్షన్ సమీపంలోని శ్మశానవాటిక వద్ద అంత్యక్రియలకు అవస్థలు కొనసాగుతున్నాయి. శ్మశానవాటిక మా ర్గంలో ఉన్నటువంటి మురుగుకాలువ పైకప్పులను ఇటీవల తొలగించారు. ఆ తర్వాత వాటిని యథాస్థానంలో ఏర్పాటు చేయకపోవడంతో, మృతదేహాలతో అంత్యక్రియలకు వచ్చేవారంతా అవస్థలు పడుతున్నారు. సోమవారం ఇదే పరిస్థితి కనిపించింది. మృతదేహానికి సంబంధించిన వ్యక్తులే సొంతంగా కాలువ పైకప్పులను ఏర్పాటు చేసుకుని మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. అయితే గత కొన్నిరోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ అధికారుల్లో చలనం కలగడం లేదని స్థానికులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


