మల్కన్‌గిరి: దివ్యాంగ చిన్నారికి ట్రైసైకిల్ అందజేస్తున్న అధికారులు
పర్లాకిమిడి: వినతులు అందజేస్తున్న ప్రజలు
రాయగడ: వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ కులకర్ణి, ఎస్పీ రాజ్‌ప్రసాద్, తదితరులు
పర్లాకిమిడి: స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జాయింట్ గ్రీవెన్స్ సెల్‌కు అధిక స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు జిల్లా మాజిస్ట్రేటు (రెవెన్యూ) మునీంద్ర హాన గ, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి దయామయ పాడీ, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా, సబ్ కలెక్టర్ భాగవత్ సామల్ కల్యాణ్ రావ్, ఐ.టి.డి.ఎ పీఓ అంశుమాన్ మహాపాత్రో తదితరు లు హాజరయ్యారు. 78 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం 68, గ్రామ సమస్యలకు సంబంధించినవి 10 ఉన్నాయి. ముఖ్యంగా గుసాని సమితి గారబంద పంచాయతీలో కొలాసింగిలో ఇళ్ల స్థలా లు ఇవ్వాలని కలెక్టర్‌కు గ్రామస్తులు విన్నవించారు. కొందరు వయో వృద్ధులు పింఛన్, పట్టాలపై ఆర్జీ లు అందజేశారు. వీటిని త్వరితగతిన పరిష్కరించా లని సంబంధిత అధికారులకు ఏడీఎం హానగ ఆదేశించారు. గుసాని బీడీఓ గౌరచంద్ర పట్నాయక్, జిల్లా ముఖ్యవైద్యాధికారి మంజురాణి జెన్నా, తదితరులు పాల్గొన్నారు.
83 వినతుల స్వీకరణ..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రధమే శ్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. మాత్తి లి సమితి పరిసర ప్రాంతాల నుంచి మొత్తం 83 వినతులు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను ఆయా శాఖాల అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ పథకాలను అర్హులకు అందజేశారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశా రు. వ్యవసాయం, జీవనోపాధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు స్వయం సహాయక సంఘానికి ప్రత్యేక విత్తన మూలధనం అందించా రు. ఆత్మ పథకం కింద రైతుల్లో ఆధునిక వ్యవసా య పద్ధతులు, అభివృద్ధి చెందిన సాంకేతికతపై అవగహన పెంచేందుకు ప్రదర్శన కార్యక్రమం ద్వా రా స్వీట్‌కార్న్ విత్తనాలను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్, మాత్తిలి సమితి బీడీఓ ప్రమోద్ బెహ రా, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
87 వినతులు..
రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షత న సోమవారం స్థానిక డీఆర్‌డీఏ సమావేశం మందిరంలో జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో 87 వినతులను ఆయన స్వీకరించారు. ఇందులో 65 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించగా.. మరో 19 సామూహిక గ్రామ సమస్యలుగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రెడ్ క్రాస్ నిధుల నుంచి ముగ్గురుకి రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. స్వీకరించిన వినతుల్లో పది సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజ్ ప్రసాద్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, సబ్ కలెక్టర్ మృణాళిని రాథోడ్, డీఎఫ్‌ఒ అన్నాసాహేబ్ అహోలే, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ బిశ్వంబ ర్‌కుమార్ బెహర, అధికారులు పాల్గొన్నారు.


