రాయగడ: స్థానిక డీఆర్‌డీఏ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి సోమవా రం వినతులను స్వీకరిస్తున్న సమయంలో మహిళ అస్వస్థతకు గురై అక్కడే పడిపొయింది. జిల్లాలోని గుడారి ప్రాంతానికి చెందిన చంద్రకళ గౌడొ అనే మహిళ తన సమస్యలను విన్నవించుకునేందుకు రాయగడకు వచ్చింది. తన సమస్యను వివరించేందుకు వేచి ఉన్న ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. అక్కడే ఉన్న కలెక్టర్ సెక్యూరిటీ గార్డు ఆమెను పట్టుకు నే ప్రయత్నం చేశారు. అనంతరం కలెక్టర్ కుల కర్ణి స్పందించి సీడీఎంఓ డాక్టర్ బిశ్వంబర్ కు మార్ బెహరాను ఏం జరిగిందో చూడమని చెప్పారు. కొంతసేపు పరిశీలించిన డాక్టర్ బెహరా వెంటనే హాస్పిటల్‌లో చేర్పించాలని సూచించారు. అనంతరం ఆంబులెన్స్‌ను రప్పించి ఆమెను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నా రు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడా ఉందని వై ద్యులు తెలిపారు. బీపీ తగ్గిన కారణంగా ఆమె ఒక్కసారిగా కింద పడిపోయినట్లు తెలుస్తోంది.
జవాన్‌కు అన్యాయం
సంతబొమ్మాళి: దేశ సరిహద్దుల్లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నా.. సొంతూరులో న్యాయం కోసం పోరాడాల్సి వ స్తోందని సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామానికి చెందిన జవాన్ దీర్ఘాశి చిట్టయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మూలపేట పోర్టు నిర్మాణానికి సానుకూలంగా స్పందించి గ్రామాన్ని, భూములను త్యాగం చేసిన తమకు పరిహారం విషయంలో అన్యాయం చేశారంటూ జమ్మూ కశ్మీర్ నుంచి వీడియో ద్వారా సోమవారం తన అవేదన వ్యక్తం చేశారు. రూ.50లక్షల వ్యయంతో ఇల్లు నిర్మించినప్పటికీ పోర్టు యాజమాన్యం, అధికారులు కేవ లం రూ. 25లక్షలకే ఎస్టిమేషన్ వేశారని చిట్టయ్య తెలిపారు. దీనిపై న్యాయం చేయా లని కోరుతూ రీ ఎస్టిమేషన్ వేయాలని కలెక్టర్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్ హేమ సుందర్‌రావుకు వినతి పత్రాలు అందజేసినట్లు చెప్పారు. వినతి పత్రం ఇచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మూలపేట గ్రామానికి, తమ ఇంటికి వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారని చిట్టయ్య తెలి పారు. ఎందుకని ప్రశ్నిస్తే టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి నిలిపివేయాలని చెప్పినట్లు సమాధానం ఇచ్చారని తెలిపారు. పోర్టు నిర్మాణం కోసం ఇంత త్యాగం చేసిన తమకు కనీసం న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు తమ సమస్యలను పట్టించుకోకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. అన్యాయాన్ని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో పంపినట్లు జవాన్ చిట్టయ్య తెలిపారు.
100 బస్తాల యూరియా పట్టివేత
జలుమూరు: మండల పరిధి చల్లవానిపేట, గుగ్గిలి వద్ద విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 100 బస్తాలు యూరియా, ఐదు టన్నుల బియ్యంను సోమవారం సీజ్ చేశారు. చల్లవానిపేట వద్ద తనిఖీలు చేయగా ఒడిశా రాష్ట్రం పర్లాఖిముడి నుంచి వ్యాన్‌తో పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన డోల రమణ మూర్తి 4.5 మెట్రిక్ టన్నుల యూరియా తరలిస్తుండగా వాహనాన్ని ఆపి తనిఖీలు చేసి 100 బస్తాలు యూరియా గుర్తించామని విజిలెన్స్ అధికారి రామారావు తెలిపారు. ఎలాంటి ప త్రాలు లేనందున యూరియాను చల్లవానిపేట పీఏసీఎస్‌లో భద్రపరిచి వాహనాన్ని జలుమూ రు పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామన్నారు.
గుగ్గిలిలో రేషన్ బియ్యం పట్టివేత
గుగ్గిలి వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా అదే గ్రామానికి చెందిన కోరాడ గోవిందరావు ఆటోలో పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. పరిసర గ్రామాల్లోని రే షన్ కార్డు దారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి పర్లాఖిముండి తరలిస్తున్నట్లు తెలిపారు.
సారవకోట: పాలకొండ గ్రామానికి చెందిన శైలా మన్మధరావుకు సోమవారం పాతపట్నం జూనియర్ సివిల్ జడ్జ్ ఎం.రోషిణి ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ అనిల్ కుమార్ తెలిపారు. 2022లో సారవకోట గ్రామానికి చెందిన కూన పొట్టెమ్మను ఆటోతో ఢీకొని ఆమె మృతికి కారణమయ్యాడు. దీనిపై అప్పటి ఎస్‌ఐ లావణ్య కేసు నమోదు చేసి చార్జిషీటు వేశారు. దీనిపై వాదోపవాదనలు జరిగిన తర్వాత సోమవారం శైలా మన్మధరావుకు ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు.


