పర్లాకిమిడి: రాష్ట్రంలో గజపతి జిల్లా వరుసగా 2024–25, 2025–26 విద్యా సంవంత్సరంలో ఒడిశా టెన్త్ బోర్డు పరీక్షల్లో 99.31, 99.35 శాతంతో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినందు కు న్యూఢిల్లీలో జాతీయ విద్యావిధానం, పరిపాల నా సంస్థ (నైపా) ఆధ్వర్యంలో గజపతి డీఈఓ మయాధర్ సాహుకు ఇటీవల అవార్డును అందజేశా రు. ఆయన చేసిన కృషిని గుర్తించి పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ పారిశెల్లి రామరాజు సోమవారం డీఈఓ కార్యాలయంలో డీఈఓ మయాధర్ సాహును ఘనంగా సన్మానించా రు. డీఈఓ కార్యాలయంలో అదనపు డీఈఓ ఎస్.గిరిధర్, సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్, జిల్లా సైన్సు కోఆర్డినేటరు ఎ.కృష్ణారావు, సి.హెచ్.వెంకటరావు, సీనియర్ అకౌటెంట్ దుర్గామాధవ్ పాడీ, పాతపట్నం ఆదర్శ విద్యాలయం హెచ్‌ఎం భీమ్ సేన్ పండా, తదితరులు పాల్గొన్నారు.


