● శ్రీముఖలింగంలో చెత్త బండిలో పూజాద్రవ్యాల తరలింపు
జలుమూరు: శ్రీముఖలింగంలో మహాదేవునికి మరోసారి అపచారం జరిగింది. గత నెలలో ఓ శునకం శివలింగం పానపట్టం మీద నిద్రించడంపై ‘సాక్షి’లో కథనం వచ్చిన వెంటనే దేవదా య శాఖ అధికారులు స్పందించి ఆలయ సంప్రోక్షణ, శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు స్వామికి సమర్పించిన పూజా ద్రవ్యాలను చెత్తతో కలిపి నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్‌తో తరలించడంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నా రు. ప్రధాన దేవాలయంతోపాటు ఆలయ పరిసరా ల్లో ఉన్న శివలింగాలు, ఇతర దేవతా విగ్రహాలు, అష్టగణపతులకు భక్తులు చేసిన పూజలు అనంతరం పూలు, పత్రి, ఇతర పూజా సామగ్రిని పక్కనే ఉన్న వంశధార నదిలో గానీ, ఆలయం చెంతనే ఉన్న ఓ గోతిలో పవిత్రంగా నిమజ్జనం చేయాలి. కానీ ఏకంగా పంచాయతీ చెత్త బండిలో పూజాద్రవ్యాలను ఉంచి ఇళ్ల నుంచి సేకరించిన చెత్త, మాంసం వ్యర్థాలతో కలిపి పారబోస్తున్నారు. భక్తులు స్వామికి సమర్పించిన మారేడు, నేరేడు పత్రి, స్వామి పూ ల దండలతోపాటు సుగంధ ద్రవ్యాలను ఇలా తరలించడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఆలయ ఈఓ కె.ఏడుకొండలును వివరణ కోరగా తన దృష్టికి వచ్చిందని, ఇక నుంచి అలా జరగకుండా చూస్తామన్నారు.


