జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరి ప్రాంతంలో గల సుప్రసిద్ధ శైవ క్షేత్రానికి శ్రావణ మాసంలో ఒడిశా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, సరిహద్దు ఆంధ్ర ప్రదేశ్‌ల నుండి ప్రతిదినం వేలాది మంది బోల్ భమ్ భక్తులు వస్తారు. సదుపాయాలపై సమీక్షించేందుకు గుప్తేశ్వర్‌లో సమావేశం నిర్వహించారు. దేవదాయ విభాగ అధికారి, జయపురం తహసీల్దార్ సబ్యసాయి జేన అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొట్‌పాడ్ ఎం.ఎల్.ఎ రూపు భొత్ర, దేవదాయ పరిచాలన కమిటీ చైర్మన్ దేవేంఽధ్ర బాహిణీపతి బొయిపరిగుడ బీడీఓ, తహసీల్దార్, పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో భోల్‌భం భక్తులకు తగిన రక్షణ కల్పించాలని బొయిపరిగుడ పోలీసు అధికారులకు ఆదేశించారు. భక్తులకు రక్షిత తాగునీరు సౌకర్యం కల్పించాలని, గుప్తేశ్వర్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగు చర్యలు చేపట్టాలని, శబరి నదీ ఘాట్‌లో భోలభమ్ భక్తుల స్నానాలకు తగిన ఏర్పాట్లు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే తదితరులు గుప్తేశ్వర్‌లో సౌకర్యాలను పరిశీలించారు. గుప్తేశ్వర్ గృహలో ఉన్న మహా శివ లింగాన్ని దర్శించారు. గుప్తేశ్వర్ ప్రాంతాన్ని పరిశీలించి చేపట్టవలసి ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.


