కొరాపుట్: ఉత్ప్రేరక ఇంజెక్షన్లు విక్రయిస్తున్న స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌డీపీఓ సుమిత్రా జెన్న ఈ కేసు వివరాలు ప్రకటించారు. విక్రయానికి ఆంక్షలు ఉన్న పెంటాజోసిన్ ఇంజెక్షన్లు విక్రయం జరగుతుందనే సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో గెరుగుడ బైరవీ ఆలయం సమీపంలో దాడులు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను సోదాలు చేయగా వారి వద్ద 453 ఇంజెక్షన్లు పట్టుబడ్డాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని సిమిలిగుడ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక టవేరా కారు సీజ్ చేశారు. వారిపై మారక ద్రవ్యాల రవాణా చట్టంతో పాటు ఎన్‌డీపీఎస్ కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి జైలుకి తరలించారు. ఈ ఇంజెక్షన్లు కళాశాలలు, యువకులకు విక్రయిస్తున్నారన్నారు. నిందితులలో ఒకరు పరారయ్యారని తెలిపారు. పట్టుబడిన వారిలో విక్రమ, సౌమ్యరంజన్, నిశాన్, సిద్దాంత్ లు ఉన్నారు.


