పర్లాకిమిడి: స్థానిక హైస్కూల్ జంక్షన్ స్టేట్‌బ్యాంకు మెయిన్ బ్రాంచి వద్ద పట్ట పగలు దొంగతనం జరిగింది. శైలాడ గ్రామానికి చెందిన సూర్యారావు రూ.5 లక్షలు డ్రా చేసి డబ్బు సంచిని బైక్ వద్ద పెట్టి హెల్మెట్ పెట్టుకునే సమయంలో డబ్బు కాజేశారు. దీంతో లబోదిబోమన్న సూర్యారావు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గేటు వద్ద అమర్చిన సీసీ ఫుటేజీ సాయంతో దొంగతనం తీరును పరిశీలించారు. కస్టమర్ బ్యాంకులో రూ.5 లక్షలు విత్‌డ్రా చేసినప్పుడు దొంగ గమనిస్తున్నట్లు సమాచారం. తన ఇంటి నిర్మాణానికి డబ్బు డ్రా చేసి వెళ్తున్నానని సూర్యారావు తెలిపారు. పోలీసులు కొన్ని గంటల్లో దర్యాప్తు చేసి పట్టణంలో ఉన్న అన్ని సీసీ పుటేజీలు చెక్ చేసి దొంగను పట్టుకున్నట్టు మోడల్ పోలీసు స్టేషన్ అధికారి ప్రశాంత్ భూపతి తెలియజేశారు. పోగోట్టుకున్న డబ్బు దొరికినట్టు సమాచారం తెలుసుకున్న కస్టమరు సూర్యారావు పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు.


