కొరాపుట్ : యుద్ధ ప్రభావంతో కొత్త తరహా దొంగల ముఠాలు ఏర్పడ్డాయి. సోమవారం కొరాపుట్ సదర్ పోలీస్ స్టేషన్ పోలీసులు డీజిల్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ఎస్‌డీపీఓ సంజయ్ మండల్ ఈ కేసు వివరాలు ప్రకటించారు. పొడాఘఢ్ ప్రాంతంలో ఒక ట్రక్ నుంచి డీజిల్ దొంగతనం అవ్వడంతో పోలీసులు ముఠా కోసం గాలించారు. మొత్తం 11 మంది ముఠాలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా టునా హరిజన్, ధనుర్జయ్ పరజాలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారితో పాటు డీజిల్ కొనుగోలు చేసిన మరో ఆరుగురు దుకాణ యజమానులను కూడా అరెస్టు చేశారు. వీరి నుంచి 470 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
ప్రధాన మంత్రికి గవర్నర్ శుభాకాంక్షలు
భువనేశ్వర్: 8,931 రోజుల సుదీర్ఘ పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా నిలిచిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి హదయపూర్వక అభినందనలు తెలిపారు. నిర్ణయాత్మక నాయకత్వం, అంకిత భావం మరియు భారత దేశ ప్రగతి పట్ల అచంచలమైన నిబద్ధతతో కూడిన ఒక అద్భుతమైన ప్రయాణంగా ఈ విజయాన్ని అభివర్ణించారు. భావి ప్రయాణంలో ఆయనకు నిరంతర శక్తి, విజయం చేకూరాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆకాంక్షించారు.


