భువనేశ్వర్: పూరీ బస్ స్టాండ్‌లో ఒక ప్రైవేట్ బస్సుకు నిప్పంటుకుంది. మంగళ వారం రాత్రి పొద్దుపోయాక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. చాలా సేపటి తర్వాత అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కొంత మంది దుండగులు కావాలనే నిప్పంటించి ఉంటారని అనుమానిస్తున్నారు.
జనగణనపై శిక్షణ
మల్కన్‌గిరి: దేశంలో మొదటిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ జనగణన –2027ను విజయవంతం చేయడానికి మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే పర్యవేక్షణలో సోమవారం శిక్షణ ఇచ్చారు. మల్కన్‌గిరి నోడల్ హైస్కూల్ ప్రాంగణంలో మల్కన్‌గిరి తహసీల్దార్ పరిధిలోని ఎన్యూమరేటర్లు (లెక్క గణకులు), సూపర్‌వైజర్లు కోసం మొదటి బ్యాచ్ శిక్షణ శిబిరం విజయవంతంగా పూర్తియింది. రెండో విడత శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేధ్బ్‌ర్ ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా జనగణన అధికారి మునా తురుక్, మల్కన్‌గిరి తహసీల్దార్ విశ్వరంజన్ విశ్వస్ శిక్షణార్థులకు మార్గదర్శనం చేశారు. ఫీల్డ్ ట్రైనర్‌గా భాగ్యరంజన్ లెంకా, హరప్రసాద్ మహాపాత్రో పాల్గొని మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరిణకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ అందించారు. జిల్లాలో మొత్తం జనగణన (జనభ లెక్కలు) పనుల కోసం 1269 మంది ఎన్యూమరేటర్లు, 227 మంది సూపర్ వైజర్లను నియమించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 6వ తేదీ వరుకు జరుగుతుంది. అనంతరం ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి డిజిటల్ విధానంలో సమాచారం సేకరిస్తారని అధికారులు తెలిపారు.


