వ్యతిరేక దినోత్సవం’ | - | Sakshi
Sakshi News home page

వ్యతిరేక దినోత్సవం’

Mar 24 2026 6:56 AM | Updated on Mar 24 2026 6:56 AM

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026
‘ఇది సామ్రాజ్యవాదుల..

జయపురం:

మ్యూనిస్టు పార్టీ దాని అనుబంధ సంస్థలు అమర వీరుల దినోత్సవాన్ని సామ్రాజ్యవాదుల వ్యతిరేక దినంగా నిర్వహించారు. కొరాపుట్‌ జిల్లా కమ్యూనిస్టు పార్టీ, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్‌, ఉత్కళ మహిళా సమితి సంయుక్తంగా అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమర వీరులు భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయపురం శ్రామిక భవనం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన మార్గంలో గల సహిద్‌ లక్ష్మణ నాయిక్‌ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి జుధిస్టర్‌ రౌళో అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయంత దాస్‌ మాట్లాడుతూ అమర వీరులు భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌లు బ్రిటిష్‌ వలస పాలనలో దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ప్రపంచంలో సామ్రాజ్యవాదుల దురాగతాలపై ఆయన నిప్పులు చెరిగారు. అమెరికా, ఇజ్రాయిల్‌ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement