పర్లాకిమిడి: గజపతి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్, భారతీయ రెడ్ క్రాస్, ఒడిశా ఆధ్వర్యంలో ‘మేక్ ఎ ఛేంజ్ ఇన్సిటివ్’ ఆధీనంలో ఎస్సీ, ఎస్టీలకు స్వశక్తీకరణ, అనాధల కోసం సామర్థ్య నిర్మాణ శిక్షణా కార్యక్రమాలు స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో రెడ్ క్రాస్ అధికారి సంజీవ్ కుమార్ దాస్, ఆదనపు డీఈఓ ఎస్.గిరిధర్, జిల్లా శిక్షాక్రీడాధికారి సురేంద్ర కుమార్ పాత్రో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ కోఆర్డినేటరు అంపోలు రవికుమార్, సీనియర్ రిసోర్‌పర్సన్ సంజయ్ చంద్ర సాహు, గాంధీ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్.తిరుపతిరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. జూనియర్ రెడ్‌క్రాస్‌లో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రక్తదానం, ప్రాథమిక చికిత్స, సైబర్ మోసాల నుంచి సురక్షా, రోడ్డు భధ్రతా, తదితర సామాజిక సేవలు గురించి వివరించారు. కొత్తగా చేరిన రెడ్ క్రాస్ అభ్యర్థులకు బ్యాడ్జీ, పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రీని అందజేశారు. రాష్ట్ర జూనియర్ రెడ్ క్రాస్ అధికారి లక్ష్మణకుమార్ స్వయిని, మహేంద్రగిరి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పూర్ణచంద్ర ప్రధాన్‌కు జూనియర్ రెడ్ క్రాస్ అధికారి లక్ష్మణ ముర్ముకు అభినందనలు తెలిపారు.


