మందస: బిడిమి గ్రామంలో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బిడిమి గ్రామంలో ప్రజలు, రైతులు నల్ల రిబ్బన్లతో సమావేశంలో పాల్గొని నిరసన తెలిపారు. గత 18 నెలలుగా కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నామన్నారు. సర్పంచ్ ధర్మారావు మాట్లాడుతు కొంతమంది వ్యక్తులు శ్రీకాకుళం కలెక్టరేట్ వెళ్లి భూములు ఇవ్వడానికి ఈ ప్రాంతం ప్రజలు సిద్దంగా ఉన్నారని ప్రచారాన్ని చేస్తున్నారని,కానీ అది పూర్తిగా అసత్యమని అన్నారు.
కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లతో నిరసన చేస్తున్న రైతులు


