ఉత్సాహంగా అఖిలభారత సాహిత్య పరిషత్ సమ్మేళనం
పర్లాకిమిడి: అఖిల భారత సాహిత్య పరిషత్తు, ఒడిశా అంతర్గత మహేంద్రతనయా సాహిత్య సంస్థ (గజపతి జిల్లా) శాఖ వార్షికోత్సవం, జిల్లా కవి సమ్మేళనం స్థానిక సరస్వతీ శిశు విద్యామందిర్‌లో ఆదివారం ఉదయం ఘనంగా జరుపుకున్నారు. ఈ వార్షిక ఉత్సవానికి ముఖ్యఅతిథిగా కోస్తా ప్రహారీ పూర్ణచంద్ర మాహాపాత్రో, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి నారాయణ్ నాయక్, రాష్ట్ర సహాకార్యదర్శి రామకృష్ణ త్రిపాఠి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు, మహిళా కళాశాల అధ్యాపకరాలు డాక్టర్ కళ్యాణీ మిశ్రా, సరస్వతీ శిశు మందిర్ ప్రధాన అచార్యులు సరోజ్ పండా పాల్గొన్నారు. రాజేంద్ర కుమార రథ్ అతిథులకు స్వాగతం పలుకగా, మనోజ్ కుమార్ పట్నాయక్ స్వాగత ఉపన్యాసం ఇచ్చారు. పర్లాకిమిడి పండిత గోపినాథ నోందో ఒడిశాలో ప్రథమం శబ్దకోశం రచించారని, ఒడియా భాషను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేసిన కృషి అభినందనీయమని పూర్ణచంద్ర మహాపాత్రో అన్నారు. మన మాతృభాష రక్షించుకోవాలంటే.. ఇంగ్లిషు భాష నుంచి మనం దూరంగా ఉండాలని భారతీయ సాహిత్య పరిషత్ సంపాదకులు నారాయణ్ నాయక్ అన్నారు. అలాగే ఒడియా సాహిత్యంలో అందెవేసిన డాక్టర్ రఘునాథ వోఝా పరలాఖెముండిలో భాష, సంస్కృతి, సాహిత్యం, ఒడిశా రాష్ట్ర ఆవిర్భావం కోసం పరలా మహారాజా శ్రీక్రిష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్‌పై అనేక రచనలు చేశారని రామక్రిష్ణ త్రిపాఠి అన్నారు. వందేమాతరం జాతీయ గీతం రాసి 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా స్వర్గీయ బకించంద్ర ఛటోపాధ్యాయను అవలోకనం చేసుకోవడమే కాకుండా శిశు మందిర్ విద్యార్థులంతా వందేమాతరం గీతం ఆలపించారు.
ఉత్సాహంగా అఖిలభారత సాహిత్య పరిషత్ సమ్మేళనం


