● అపూర్వ సమ్మేళనం
పర్లాకిమిడి: స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో 1992, 1993 బ్యాచ్‌ల విద్యార్థులు ఆదివారం కలుసుకుని ఆనందంగా గడిపారు. బెంగళూరు, చైన్నె, ఇతర దేశాలలో స్థిరపడినవారందరూ కలుసుకున్నారు. తమ జీవతంలో ఉన్నతశిఖారాలను అఽధిరోహించిన తీరును గురువులకు తెలియజేశారు. గురువులు ప్రఫుల్లచంద్ర పాణిగ్రాహి, బినోద్ చంద్ర జెన్నా, ఉపేంద్ర పండా, ప్రమిలా సాహుకార్, హరిహరదాస్, కుముదరంజన్ దాస్ (పిల్లా పండిత్)లను ఘనంగా సత్కరించుకున్నారు. పాతమధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1993 బ్యాచ్ విద్యార్థులు బి.ఎన్.ప్యాలస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సందడి చేశారు.
● అపూర్వ సమ్మేళనం


