● ఘనంగా స్వర్ణోత్సవం
జయపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1975లో 6వ తరగతి విద్యార్థులు ఆదివారం ఒక చోటికి చేరి ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 50 ఏళ్ల కిందట ఒకచోట చదువుకుని డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, వివిధ విభాగాలలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ వృత్తుల్లో స్థిరపడిన ఆనాటి విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో సమావేశమయ్యారు. అపూర్వ కలయికలో వారు గత 50 ఏళ్ల నాటి తీయని జ్ఞాపకాలను, ఆనాటి ముచ్చట్లు గుర్తుచేసుకున్నారు. 50 ఏళ్ల తరువాత కలయిక వారంతా అపూర్వంగా ఆశ్వాదించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఆప్యాయతను పంచుకున్నారు. అనాటి ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రతీ ఏడాది సమావేశం నిర్వహించాలని తీర్మానించారు.


