చర్చల అనంతరం ధాన్యం కొనుగోలు ప్రారంభం
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సంబల్‌పూరి
నృత్య ప్రదర్శన
రాయగడ: అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే జానపద నృత్యాలు దేశ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయని రాజ్యసభ ఎంపీ సుజిత్ కుమార్ అన్నారు. స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో కొనసాగుతున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన ప్రాంత కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని అభిప్రాయపడ్డారు. వేదికపై ప్రదర్శించిన జానపద నృత్యాలు అలరించాయి. మ్యూజిక్ గెలాక్సీ బృందం ప్రదర్శిఽంచిన నృత్యం ఆకట్టుకుంది. అదేవిధంగా సొన్‌పూర్ జిల్లా సాంసృతిక మండలి ద్వారా పనేలి, కొట్పాడ్ సాగర్ నృత్య బృందం ప్రదర్శించిన థింసా, నవరంగపపూర్, రాయగడ జిల్లాకు చెందిన గుడారి కళా సంసృతి సంఘం, కాసీపూర్, జేకేపూర్, రాయగడకు చెందిన మజ్జిగౌరి డ్యాన్స్ స్డూడియో బృందం ప్రదర్శిఽంచిన నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి.
ఉర్రూతలూగించిన రాక్‌స్టార్ రుకుసున గీతాలు
ప్రముఖ సినీనేపథ్య గాయకుడు, రాక్‌స్టార్ రుకు సున పాటలు యువతను ఉర్రూతలూగించింది. చలిలో సైతం ఆయన పాటలను ఆస్వాదించిన ప్రేక్షకులు వారి నృత్యాలు, కేరింతలతో చొయితీ వేదిక ప్రాంగణం దద్దరిల్లింది. క్లాస్, మాస్ పాటలతో గాయకుడు రుకుసున అందరిని మైమరపించారు. కళాకారులకు కలెక్టర్, చొయితీ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అశుతోష్ కులకర్ణి ఈ ప్రాంత లంజియా సవర కళలకు ప్రతీకమైన ఇడితాల్ చిత్రపటాలను జ్ఞాపికలుగా అందజేశారు. చివరిగా కార్యక్రమానికి హాజరైన జిల్లాలోని 11 సమితులకు చెందిన అధ్యక్షులను ఉత్సవ కమిటీ సన్మానించింది. జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి తదితరులు ప్రసంగించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ ఎంపీ సుజిత్ కుమార్‌ను సన్మానిస్తున్న కలెక్టర్ కులకర్ణి
చర్చల అనంతరం ధాన్యం కొనుగోలు ప్రారంభం
చర్చల అనంతరం ధాన్యం కొనుగోలు ప్రారంభం
చర్చల అనంతరం ధాన్యం కొనుగోలు ప్రారంభం
చర్చల అనంతరం ధాన్యం కొనుగోలు ప్రారంభం


