మిస్ టీన్ ఫరెవర్ యూనివర్స్‌గా మల్కన్‌గిరి యువతి మమత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పద్మాగిరి పంచాయతీకి చెందిన త్రిలోచన్ భూమియా కుమార్తె తమమతా భూమియా 17 ఏళ్లకే మిస్ టీన్ ఫరెవర్ యూనివర్స్‌గా జాతీయ స్థాయిలో నిలిచింది. ఆదివారం ఆమెకు స్థానిక బస్టాండ్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ యువతి ఇటీవల రాజస్థాన్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి మిస్ టీన్ ఫరెవర్ యూనివర్స్ పోటీలో పాల్గొంది. ఏడు వేల మందిని దాటుకుని కిరీటాన్ని సాధించింది. తనకు చిన్ననాటి నుంచి మోడలింగ్‌పై ఆసక్తి ఉందని, తల్లిదండ్రులు ఈ పోటీలకు పంపించారు. మమత ప్రస్తుతం మల్కన్‌గిరి కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం మల్కన్‌గిరి చేరుకోగా స్థానిక బస్టాండ్ వద్దనే ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అనంతరం టాప్‌లెస్ జీప్‌లో ఊరేగిస్తూ ఊరికి తీసుకెళ్లారు.
మిస్ టీన్ ఫరెవర్ యూనివర్స్‌గా మల్కన్‌గిరి యువతి మమత


