సరిహద్దులో షూటింగ్ సందడి
కొరాపుట్: రాష్ట్ర సరిహద్దులో తెలుగు సినిమా నటుడు రాజా రవీంద్ర సందడి చేశారు. కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ సమితిలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌లో పాల్గన్నారు. కూతవేటు ఉన్న ఛత్తీస్‌గడ్ రాష్ట్ర సరిహద్దులో ఉత్కళ గ్రామీణ ప్రాంతంలో తెలుగు గ్రామీణ ప్రాంత సెట్లు వేసి షూటింగ్ జరుపుతున్నారు.ఇది తెలిసి జయపూర్ నుంచి తెలుగు ప్రజలు తరలి వచ్చి సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేశారు. ఈ చిత్ర షూటింగ్ సంక్రాంతి వరకు జరగనుంది. పేరు ఇంకా ఖరారు కాని ఈ చిత్రానికి నిర్మాతగా కొట్‌పాడ్‌కి చెందిన తెలుగు యువకుడు వివేక నంద వర్మ వ్యవహరిస్తుండగా.. దర్శకునిగా రవి కిషోర్ (మిస్టర్ సెలబ్రటీ దర్శకుడు), హీరోగా వివేక్ వర్మ, హిరోయిన్‌గా సంకీర్తన నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర లో సప్తగిరి పలు సీన్లలో కొట్‌పాడ్‌లో నటించారు. గతంలో కొరాపుట్ జిల్లాలో రాజమౌళీ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన వారణాసి చిత్రీకరణ జరిగింది. అలాగే అనుష్క నటించిన ఘాటీ, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి.


