జాతీయ చాంపియన్‌గా దివ్యాంస మిశ్ర
జయపురం: భువనేశ్వర్‌లోని బుద్ధ మందిర ప్రాంగణంలో 8వ ఒడిశా సాంస్కృతిక మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన కిడ్స్ ఒలింపియాడ్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ బాలుడు దివ్యాంస మిశ్ర చాంపియన్‌గా నిలిచారు. బొయిపరిగుడ సమితి కార్యాలయ ఏపీఓగా పనిచేస్తున్న సాగరిక పండా కుమారుడు దివ్యాంస మిశ్ర. బాలుడికి ట్రోఫీతోపాటు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. బాలుడు జయపురం ఆక్టివిటీ స్కూల్‌లో నర్సరీ చదుతువున్నాడు. కిడ్స్ ఒలింపియాడ్ స్థాపకులు, అధ్యక్షుడు గురుప్రసాద్ సమరేంద్ర త్రిపాఠి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విదానసభ మాజీ కార్యదర్శి సురేష్ చంద్ర మంతి, ఫకిరీ మోహణ విశ్వవిద్యాలయ విశ్రాంత కులపతి డాక్టర్ హరిహర కనుంగో, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ద్వీపాయన పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.


