కొరై మాజీ ఎమ్మెల్యే సంచిత మహంతి కన్నుమూశారు
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకురాలు, కొరై నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే సంచిత మహంతి (67) శుక్రవారం భువనేశ్వర్‌లో కన్ను మూశారు. ఆమె గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న దశలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో జాజ్‌పూర్ జిల్లాలో విషాదం నెలకొంది. సంచిత మహంతి 2004 నుండి 2009 వరకు జాజ్‌పూర్ జిల్లా కొరై శాసన సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. శాసన సభ్యురాలిగా నియోజకవర్గ ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ సంస్థాగత కార్యకలాపాల్లో చురుకై న పాత్ర పోషించి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. 2000 దశకం ఆరంభంలో జాజ్‌పూర్ జిల్లాలో బీజేపీ ఆవిర్భావం మొదలుకొని సంస్థాగత పటిష్టత వరకు నిరవధికంగా శ్రమించి రాష్ట్రంలో బీజేపీ ఉనికిని బలపరిచిన ముందంజ ప్రముఖుల్లో ఒకరుగా సంచిత మహంతి విశేష గుర్తింపు పొందారు.


