బీజేడీ వందేళ్లు వర్ధిల్లుతుంది
● విభజన పుకార్లను తోసిపుచ్చిన నవీన్ పట్నాయక్ ● ఘనంగా బీజేడీ 29వ వ్యవస్థాపక దినోత్సవం
భువనేశ్వర్:
బిజూ జనతా దళ్ (బీజేడీ) అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ శుక్రవారం తన పార్టీ లోని విభేదాల గురించి ఊహాగానాలను తీవ్రంగా తిరస్కరించారు. ఒడిశా ప్రజల రాజకీయ గొంతుక గా బీజేడీ 100 ఏళ్లు వర్ధిల్లుతుందని ఘంటాపథంగా ప్రకటించారు. మరో వైపు రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కారు పాలనలో ఘోరంగా విఫలమైందని ఎండగట్టారు. స్థానిక శంఖ భవన్‌లో జరిగిన పార్టీ 29వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంపై పదునైన విమర్శలను సంధించారు. బీజేపీ పాలన పగ్గాలు చేపట్టడంతో బీజేడీ నాయకత్వం, సంస్థాగత వ్యవహారాల్లో అవాంఛనీయ చొరవ కల్పించుకుని గందరగోళం రేపి ప్రజల్లో ఊహాగానాలకు ఊపిరి పోస్తుందని ఎద్దేవా చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి పట్నాయక్ మాట్లాడుతూ బీజేడీ విడిపోతుందని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కొన్ని పార్టీలు పదే పదే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఈ వాదనను ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. బీజేడీ ఒకరు లేదా ఇద్దరు నాయకుల పార్టీ కాదు. ఇది ఒడిశా ప్రజల భావోద్వేగాలతో లోతైన అనుబంధంతో పెనవేసుకు పోయి న వ్యవస్థగా బలపడింది. బీజేడీ రాజకీయ ఉనికికి ఏమాత్రం ఢోకా లేదు. రానున్న 100 సంవత్సరాలు ఒడియా ప్రజల గొంతుగా గళం మారుమోగిస్తుంటుందన్నారు.
చీలిక ప్రచారం బూటకం
ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ప్రజల పార్టీగా ఉనికిని స్థిరపరచుకున్న బీజేడీలో చీలిక వచ్చే అవకాశం లేదని, బీజేడీ విచ్ఛిన్నం కాలేదని, భవిష్యత్తులో విచ్ఛిన్నం కాబోదని కూడా గట్టి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలం దాని సైద్ధాంతిక మూలాలు, బిజూ పట్నాయక్ వారసత్వం ద్వారా ఏర్పడిన ప్రజా సంబంధాలలో ఉందని ఆయన నొక్కి చెప్పా రు. బిజూ బాబు ఆదర్శాలపై బీజేడీ నిలుస్తుందని, ఆయన మార్గదర్శకంలో ఒడిశా ప్రజలకు నిరంత రం సేవ చేస్తూనే ఉంటుంన్నారు. పార్టీ కార్యకర్తలు సంస్థాగత క్రమశిక్షణ, ప్రజా సేవపై దృష్టి పెట్టాలని కోరారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై దాడి
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై పదునైన దాడి చేయడానికి పట్నాయక్ ఈ సందర్భాన్ని ఉపయోగించు
కున్నారు. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి వాదనలను నిలదీసి పాలన వైఫల్యాలుగా ఆయన అభివర్ణించా రు. రాష్ట్రంలో ప్రస్తుతం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది. కాానీ అభివృద్ధి ఎక్కడ ఉంది?‘ అని ఆయన ప్రశ్నించారు. రైతులు ఎరువులు పొందడానికి ఇబ్బంది పడుతున్నారు. మండీలు సకాలంలో తెరవక పోవడంతో తల్లడిల్లుతున్నారు. మిషన్ శక్తి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో యువత నిరాశకు గురవుతున్నారని ఆయన పే ర్కొన్నారు. శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజా రి మహిళలపై నేరాలు పెరిగాయని ఆరోపించారు.
బీజేడీ హయాం స్వర్ణ యుగం
2000 నుంచి 2024 వరకు సుదీర్ఘంగా సుమారు రెండున్నర దశాబ్దాల బీజేడీ పాలన రాష్ట్రానికి స్వర్ణయుగం. పేదరికాన్ని విజయవంతంగా ఎదుర్కొని మహిళలను శక్తివంతం చేసింది. వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఒడిశాకు కొత్త గుర్తింపును సాధించింది. బలమైన మరియు సాధికార ఒడిశానిర్మాణంలో బీజేడీ కార్యకర్తలు ప్రస్తుత సవాళ్లను భవిష్యత్తు అవకాశాలుగా మలుచుకుని పార్టీ దీర్ఘకాల వ్యవస్థగా బలపరచాలని పిలుపునిచ్చారు.
బీజేడీ వందేళ్లు వర్ధిల్లుతుంది
బీజేడీ వందేళ్లు వర్ధిల్లుతుంది


