జాతీయ యువ ఉత్సవాలకు మల్కన్‌గిరి విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

జాతీయ యువ ఉత్సవాలకు మల్కన్‌గిరి విద్యార్థిని

Dec 27 2025 6:59 AM | Updated on Dec 27 2025 6:59 AM

జాతీయ

జాతీయ యువ ఉత్సవాలకు మల్కన్‌గిరి విద్యార్థిని

జాతీయ యువ ఉత్సవాలకు మల్కన్‌గిరి విద్యార్థిని బైక్‌ ప్రమాదంలో యువకుడు మృతి బంగ్లాదేశ్‌లో దౌర్జన్యాలపై నిరసనగా ర్యాలీ మార్చిలోగా సమీకృత కలెక్టరేట్‌ సిద్ధం కావాలి బ్లాక్‌స్పాట్స్‌ వద్ద నిఘా పెంచాలి

మల్కన్‌గిరి : జాతీయ స్థాయి యువ ఉత్సవంలో మల్కన్‌గిరి జిల్లా విద్యార్థిని విదిశా మహంతి పాల్గొననున్నారు. ఆమె మల్కన్‌గిరి మోడల్‌ డిగ్రీ కాలేజ్‌లో చదువుతోంది. ఈ నెల 24 నుంచి 26 వరుకు భువనేశ్వర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిందని కలెక్టర్‌ సోమేశ్‌ ఉపాధ్యాయ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆమె జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తారని కలెక్టర్‌ తెలిపారు.

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి చిత్రాంగపల్లి పంచాయతీ ఎం.వి.55 గ్రామం వద్ద శుక్రవారం ఉదయం పగురకొండ రహదా రి పక్కన యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి కలిమెల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఐఐసీ ముకుందో మేల్కా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పక్కనే ద్విచక్ర వాహనం ఉండడంతో వాహ నం పైనుంచి పడిపోవడంతో చనిపోయి ఉంటాడని అనుమానిస్తూ కేసు నమోదు చేశారు. మృతుడు ఎం.వి.55 గ్రామానికి చెందిన బిధా న్‌ మండల్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

జయపురం: బంగ్లాదేశ్‌లో అల్ప సంఖ్య హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జయపురంలో హింధూ సమాజ్‌ ర్యాలీ నిర్వహించింది. సర్దార్‌ వల్లభాయి పటేల్‌ మార్గంలో(మైన్‌ రోడ్డు) భారీ ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్‌ యూనస్‌ దిష్టి బొమ్మతో పట్టణంలో పలు వీధుల్లో బంగ్లాదేశ్‌ వ్యతిరేక నినాదాల తో ప్రదర్శనలు జరుపుకుంటూ రథొ పొడియా కు చేరుకొని అక్కడ బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం జరిగిన సభలో హిందూ సమాజ్‌ నవకృష్ణ రథ్‌ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.

శ్రీకాకుళం : వచ్చే ఏడాది మార్చి 1 కల్లా నూత న సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణం పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కాంట్రాక్టర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో జరుగుతు న్న భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి మంత్రి శుక్రవారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడరాదన్నారు. విభాగాల వారీ గా జరుగుతున్న పనుల వివరాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనుసంధాన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పనులపై దృష్టి సారించాలన్నారు. పర్యవేక్షణకు రోడ్ల భవనాల శాఖ నుంచి కార్యనిర్వాహక ఇంజినీరు (డీఈ) స్థాయి అధికారిని నియమించా లని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తదితరులున్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో రోడ్డు ప్రమా దాల నివారణకు శాసీ్త్రయ దృక్పథంతో అడుగు లు వేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరుగుతు న్న ‘బ్లాక్‌ స్పాట్స్‌’ వద్ద రక్షణ చర్యలు ముమ్మ రం చేయాలని అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లతో పోలిస్తే 2025లో ప్రమాదాల సంఖ్య, ప్రాణనష్టం కొంత మేర తగ్గుముఖం పట్టడం సానుకూల పరిణామమన్నారు. 2024లో 889 ప్రమాదాలు జరగ్గా.. ఈ ఏడాది డిసెంబర్‌ 25 నాటికి ఆ సంఖ్య 699కి తగ్గిందన్నారు. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్‌ ధరించకపోవ డం వల్లే అత్యధిక ప్రాణనష్టం జరుగుతోందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. నవభారత జంక్షన్‌ వద్ద రోడ్డు విస్తరణకు ప్రణాళిక సిద్ధంగా చేయా లని ఆదేశించారు. భైరవానిపేట జంక్షన్‌ వద్ద స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. జనవరిని రహదారి భద్రత మాసంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని ఎస్పీ చెప్పారు.

జాతీయ యువ ఉత్సవాలకు మల్కన్‌గిరి విద్యార్థిని 1
1/2

జాతీయ యువ ఉత్సవాలకు మల్కన్‌గిరి విద్యార్థిని

జాతీయ యువ ఉత్సవాలకు మల్కన్‌గిరి విద్యార్థిని 2
2/2

జాతీయ యువ ఉత్సవాలకు మల్కన్‌గిరి విద్యార్థిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement