బీజేడీ విజయానికి కృషి చేయాలి
బిజూ పట్నాయక్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న
మాజీ ఎమ్మెల్యే మనాస్ మడ్కమి తదితరులు
మల్కన్‌గిరి: రానున్న అన్ని ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని బీజేడీ పార్టీకి చెందిన మల్కన్‌గిరి మాజీ ఎమ్మెల్యే మనాస్ మడ్కమి పిలుపునించారు. పార్టీ 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మనాస్ మడ్కమి స్థానిక లాఠియగూఢ వీధిలో ఉన్న బిజూ పట్నాయక్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మల్కన్‌గిరి జిలా అభివృద్ధిలో బీజేడీ కీలకపాత్ర పోషించిందన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టాంగులు, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీప్రియ నాయక్, సీనియర్ నాయకుడు గోపాల్ పండ, మున్సిపల్ చైర్మన్ మనోజ్ బారిక్ తదితరులు పాల్గొన్నారు.
బీజేడీ విజయానికి కృషి చేయాలి


