బండారి సంఘం నూతన కార్యవర్గం
జయపురం: జయపురం బండారి (మంగళ్లు) సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం జరిగా యి. స్థానిక ఏనుగుల శాల ప్రాంతంలోని బండారి సంఘ కార్యాలయంలో సంఘ సలహాదారులు, న్యాయవాది బిజయరాయ్ జనాదేవ్, నిర్భీక సామంతరాయ్, సుమిత్ పట్నాయక్‌ల పర్యవేక్షణ లో ఎన్నిక ప్రక్రియ జరిగింది. అధ్యక్షులుగా ఎ.పోలిరాజు, ఉపాధ్యక్షులుగా కె.సంతోష్, కార్యదర్శిగా టి.మహేష్, సహాయ కార్యదర్శిగా ఎ.సత్యనారాయణ, కోశాధికారిగా వై.ప్రవీణ్, సహాయ కోశాధికారిగా లాలు బెహర, న్యాయ సలహాదారునిగా న్యాయవాది బిజయ రాజ్ జెనాదేవ్, నిర్బీక సామంతరాయ్, సుమిత్ పట్నాయక్ ఎన్నికయ్యారు. నూత న కార్యవర్గంతో న్యాయ సలహాదారు బిజయరాజ్ జనాదేవ్ ప్రతిజ్ఞ చేయించారు. నూతన కార్యవర్గ సభ్యులను బండారి సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు పూలమాలలతో సత్కరించారు.


