40 మంది విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ
జయపురం: ఎస్‌బీఐ సేవా కార్యక్రామల్లో భాగంగా జయపురంలోని ప్రాంతీయ కార్యాలయంలో శుక్ర వారం నిర్వహించిన కార్యక్రమంలో 40 మంది విద్యార్థినులకు సెకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ భువనేశ్వర్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎ.డి.రతన్ తేజ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సమాజ సేవలో తనవంతు బాధ్యత లు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 40 మందికి రూ. 2.32 లక్షల విలువైన సైకిళ్లను అందించామన్నారు. అలాగే మల్కన్‌గిరి ఆస్పత్రికి రూ. 9,71,982 విలువైన అంబులెన్స్‌ను అందించామన్నారు.
40 మంది విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ


