తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి
జయపురం: జనవరి నెలలోగా జిల్లాలో ఏర్పాటు చేసి మండీలలో పడి ఉన్న రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని మాజీ మంత్రి రబినారాయణ నందో జిల్లా సివిల్ సప్లై అధికారిని హెచ్చరించారు. గతంలో ముందుగా తెలిపిన ప్రకారం శుక్రవారం రబినందో నేతృత్వంలో వందలాది మంది బీజేడీ కార్యక్తలు, రైతులు జిల్లా సివిల్ సప్లై అధికారి కార్యాయాన్ని ముట్టడించారు. ఆందోళనకారులు కార్యాయంలోనికి రాకుండా కార్యాలయ ప్రధాన గేటు మూసి వేయటంతో కార్యాలయం ముందు వారంతా ధర్నా జరిపారు. కొంతసేపటి తరువాత నారాయణ నందో జిల్లాలో మండీల నిర్వహణలో అధికారుల నిర్లిప్తతపై మండి పడ్డారు. జిల్లాలో గత 11 వ తేదీన మండీలు ప్రారంభించినప్పటికీ నేటి వరకు ఒక్క కిలో ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. ఇప్పటికై నా మండిల్లోని ధన్యాన్ని తక్షణమే ధర్నా చేస్తామని హెచ్చరించారు. బీజేడీ నేతలు బాలారాయ్, బి.బాలంకి రావు,నారాయణ దొర,మున రథో పాల్గొన్నారు.
తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి


