ఫారెస్టర్ ఆస్తులు లక్ష్యంగా విజిలెన్స్ దాడులు
కొరాపుట్: ఫారెస్టర్ ఆస్తులు లక్ష్యంగా విజిలెన్స్ దాడులు జరుగుతున్నా యి. శుక్రవారం కొరాపుట్ జిల్లా ఫారె స్ట్ డివిజన్ ఫారెస్టర్ నిరంజన్ సత్పతి ఆస్తులు లక్ష్యంగా ఈ దాడులు ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. కొరాపుట్ జిల్లా సిమిలిగుడలో కార్యాల యం, కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్వార్టర్స్, జగత్‌సింగ్‌పూర్ లోని తల్లిదండ్రుల నివాసం, భువనేశ్వర్‌లోని మూడంతస్తుల సొంత భవనం, అదే ప్రాంతంలో మరో సొంత భవనంలో ఈ దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరుగురు డీఎస్పీలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. భువనేశ్వర్ లో ని స్పెషల్ విజిలెన్స్ జడ్జి ఈ దాడులకు సెర్చ్ వారెంట్ల్ అనుమతి ఇచ్చారు.
ఫారెస్టర్ ఆస్తులు లక్ష్యంగా విజిలెన్స్ దాడులు


