అటల్‌జీ ఆదర్శాలు ప్రేరణాత్మకం
భువనేశ్వర్: భారత మాజీ ప్రధాన మంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఎయిమ్స్ ఆవరణలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి కృషిని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ వాస్తవ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేసి, దేశానికి భద్రత, అభివృద్ధి, ఆత్మ గౌరవం యొక్క కొత్త కోణాన్ని జాతికి ప్రదానం చేసిన అటల్‌జీ ఆదర్శాలు నిరంతరం ప్రేరణాత్మకంగా వెలుగొందుతాయన్నారు. పవిత్ర జయంతి సందర్భంగా, మనం ఆయన జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ దేశం మరియు ఒడిశా యొక్క సర్వతోముఖాభివృద్ధికి అటల్‌జీ ఆదర్శ మార్గాన్ని అనుసరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్ర పటానికి
పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి
మోహన్ చరణ్ మాఝీ


