స్నేహితుడిని రైలు ఎక్కించేందుకు వెళ్లి..
● రైలు చక్రాల కింద పడి యువకుడు మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియ సమితి క్రిస్టియన్ వీధికి చెందిన వాంతల విజయ్ రత్నం (23)అనే యువకుడు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు కిరణ్‌ను రైలు ఎక్కించేందుకు స్టేషన్‌కు వచ్చాడు. అతడిని రైలెక్కించి రైలు దిగబోతూ కాలుజారి రైలు కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో గురువారం ఉదయానికి మృతదేహాన్ని పొడియాకు తీసుకువచ్చారు. పండగకు రాలేనని చెప్పిన యువకుడు శవమై వచ్చాడని కుటుంబ సభ్యులు రోదించారు.


