ఏసీఏ వార్షిక క్రీడోత్సవం ప్రారంభం
భువనేశ్వర్: స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి ఏసీఏ వార్షిక క్రీడోత్సవం గురువారం ఆరంభమైంది. భువనేశ్వర్ (కేంద్ర) నియోజకవర్గం ఎమ్మెల్యే అనంత నారాయణ జెనా, మధుసూదన నగర్ వార్డు కార్పొరేటరు ఓలీ ఓలీ అతిథులుగా పాల్గొని ఈ ఉత్సవం ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ వరకు సమితి సభ్యులకు ఈ పోటీలు నిరవధికంగా కొనసాగుతాయని సంస్థ కార్యదర్శి రాయప్రోలు సత్య సాయి తెలిపారు. నిత్యం సాయంత్రం 5.30 గంటల నుంచి సమితి ప్రాంగణంలో పలు పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సమితి వార్షిక కార్యక్రమాల్లో భాగంగా మహిళలు, పురుషులకు వేర్వేరు వర్గాల క్రీడల పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు గన్నవరపు ఆనందరావు తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా ఏక్ మినిట్ గీతాలాపన, చైనీస్ చక్కర్, మ్యూజికల్ బాల్, పురుషులకు హిట్టింగ్ ద బాల్ బ్‌లైండ్ ఫోల్డు, మ్యూజికల్ చైర్ పోటీలు, ఉభయ మహిళలు, పురుషులకు కేరమ్ బోర్డు పోటీలు కొనసాగుతాయన్నారు.
మహిళా సభ్యుల క్రీడానందం
ఏసీఏ వార్షిక క్రీడోత్సవం ప్రారంభం


