స్వయం ఉపాధికి సహకరించాలి
జయపురం: స్వయం ఉపాధి పథకాలకు సహకార సంస్థలు సహకరించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్థానిక డిప్యూటీ రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ సభాగృహంలో ఇంటర్ నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్–2025 ప్రారంభం ఉత్సవం నిర్వహించారు. కొరాపుట్ జిల్లా సహకార విభాగం ద్వారా, సహకార విభాగ అధికారి మోనిక రాయ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఆర్‌ఎంఎ గుజరాత్ విశ్రాంత ప్రొఫెసర్ హరేకృష్ణ మిశ్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటర్ నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 లక్ష్యం సమగ్ర అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సమానత్వం ద్వారా సహకార ఉద్యమం మంచి ప్రపంచ నిర్మాణం అని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర చంద్రపాణిగ్రహి, సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళో, తదితరులను ఆహ్వానించక పోవటంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.


