
అధికారుల తనిఖీలు.. బెంబేలెత్తిన వ్యాపారులు
సారవకోట: మండల కేంద్రంలో గురువారం విశాఖపట్నం నుంచి ఫుడ్ కంట్రోలర్ ఎస్.ఈశ్వరి, జిల్లాకు చెందిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మి కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో వ్యాపారులంతా బెంబేలెత్తారు. రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారని తెలిసి అందరూ దుకాణాలు మూసివేశారు. తాము పరిశీలించిన దుకాణాల్లో తేదీల లేపా లు లేవని వారు తెలిపారు. వ్యాపారాలు చేసుకునే వారు స్వలాభం తగ్గించుకుని ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉన్న వస్తువులు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
టెక్కలి రూరల్: టెక్కలి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని నర్సింగిపల్లి గ్రామానికి చెందిన సింహాద్రి చలపతిరావు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైల్వే గేటు నుంచి టెక్కలి రైల్వే స్టేషన్ మధ్యలో పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా రైలు వచ్చి ఢీ కొట్టడంతో పక్కనున్న పొదల్లోకి తుళ్లిపోయాడు. ప్రమాదం గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన చలపతిరావును తీసుకువెళ్లేందుకు 108 వాహనం రాగా అప్పటికే ఆయన మృతి చెందాడు.
పలాస: పలాస రైల్వే స్టేషన్ పరిధిలోని రెండో ప్లాట్‌పారం లైన్‌లో వంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద జారి పడి మృతి చెందినట్టు పలాస జీఆర్పీ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మృతుడికి సుమా రు 45 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. శరీరంపై నాచురంగు గల ఫాంటు, నీలం రంగు గల టీ షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440627567 సంప్రదించాలని ఆయన కోరారు.
కొల్లవానిపేటలో..
నరసన్నపేట: మండలం కొల్లవానిపేట సమీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని ఆమదాలవలస రైల్వే ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఒడిశా వాసిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు పోస్టుమార్టం కోసం తరలించామన్నారు.