
● ఘనంగా శిశు మహోత్సవం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి దండాబడి పంచాయతీ సాధనా కేంద్రం వారి ఆధ్వర్యంలో శిశు మహోత్సవం సురభి–2025 నిర్వహించారు. సురభి జిల్లా కోఆర్డినేటర్ గోపీనాత్ సెఠి అధ్యక్షతన గురువారం దండాబడి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగింది. కార్యక్రమంలో నిర్వహించిన సాహిత్యం, సంస్కృతి, సంగీతం, నృత్య, చిత్ర కళా పోటీల్లో విద్యార్థులు చూపిన ప్రతిభను నిర్వాహకులు ప్రశంసించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొయిపరిగుడ సమితి ఉపాధ్యక్షుడు పూర్ణిమ బారిక్ ఫాల్గుని మాట్లాడుతూ సురభి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. గౌరవ అతిథులుగా దండాబడి గ్రామ పంచాయతీ సర్పంచ్ చెండియ ఖిలో, చిపాకూర్ పంచాయతీ సర్పంచ్ రాజు ఖిలో సమితి సభ్యులు బిమళ ఖిలో, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుధీర్ కుమార్ ప్రధాన్ పాల్గొన్నారు. శిశు మహోత్సవం సురభి–2025 పోటీల్లో 16 పాఠశాలల నుంచి అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు.