
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రమేష్ సాహు
● జనరల్ సెక్రటరీగా పూర్ణిమా
ప్రియ దర్శిని
కొరాపుట్: అధికార భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రమేష్ సాహు నియమితులయ్యారు. నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్ కోట్ పట్టణానికి చెందిన రమేష్ పార్టీ ఆవిర్భాం నుంచి కొనసాగుతున్నారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు రాష్ట్ర పదవులు నిర్వర్తించారు. అలాగే కొరాపుట్ జిల్లాకి చెందిన పూరి ్ణ మా ప్రియ దర్శిని నాయక్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. పూర్ణిమా కొరాపుట్ జిల్లాలో బీజేపీ పటిష్టానికి కృషి చేశారు. గతంలో జిల్లా స్థాయిలో మహిళా విభాగంలో పార్టీకి సేవలు చేశారు.
ఉచిత నేత్రవైద్య శిబిరం
రాయగడ: సదరు సమితి పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన జేకే పేపర్ మిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సీఎస్‌ఆర్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రాజెక్టు రోషిని ద్వారా గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పితామహాల్‌లోని ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరంలో జేకేపూర్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు పరీక్షించి 23 మందికి క్యాటరాక్ట్, 27 మందికి దష్టిలోపం ఉన్నట్టు వైద్యులు గుర్తించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వారికి ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. శిబిరంలో విజన్ టెక్నిషియన్ జగదీస్ కొండగొరి, జేకే పేపర్ మిల్ అసిస్టెంట్ మేనేజర్ హరిహర ఖమారి పాల్గొన్నారు.
కార్యాలయాల సందర్శన
పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ మధుమిత శుక్రవారం పర్లాకమిడిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. జిల్లా ట్రెజరీ, ఆర్టీవో, ఆదర్శ పోలీస్‌స్టేషన్లను సందర్శించి రికార్డులు పరిశీలించారు. స్థానిక మోడల్‌పోలీస్‌స్టేషన్‌లో సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, ఐఐసీ ప్రశాంత భూపతితో క్రైం రేటుపై సమీక్షించారు.
పౌష్టికాహారంపై అవగాహన
కొరాపుట్: పౌష్టికాహారంపై మహిళలకు అవగాహన ఉండాలని నబరంగ్‌పూర్ మహిళా మహా విద్యాలయం అధ్యాపకురాలు డాక్టర్ సంజుక్త పండా పేర్కొన్నారు. శుక్రవారం మహా విద్యాలయం ఆవరణలో పౌష్టికాహారంపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆహార అలవాట్లపై లోపంతో మహిళలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న మిల్లెట్ల వినియోగం పెరగాలన్నారు. సమావేశం లో ప్రిన్స్‌పాల్ మల్లేశ్వరి సాహు, ప్రొఫెసర్ సునితా పాత్రో, ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ సౌర పాల్గొన్నారు.
ల్యాప్‌టాప్ దొంగల అరెస్టు
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్‌లో మిషన్ శక్తి కార్యాలయంలో రెండు రోజుల కిందట ల్యాప్‌టాప్‌ను కొందరు దొంగిలించారు. మోహన పోలీసు సిబ్బంది దర్యాప్తు చేసి మోహ న బ్లాక్ సంతోషినగర్‌కు చెందిన ఇద్దరు యువ కులు అంకిత్ నాయక్, అభిజిత్ పాత్రోలను అరెస్టు చేసి శుక్రవారం మోహన కోర్టుకు తరలించినట్టు ఐఐసి శుభ్రాంత్ పండా తెలియజేశారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రమేష్ సాహు

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రమేష్ సాహు

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రమేష్ సాహు