
ఆదర్శ విద్యాలయ గేటుకు తాళాలు
జయపురం: జయపురం సమితి జయంతిగిరి ఒడిశా ఆదర్శ విద్యాలయ ప్రధాన గేటుకు విద్యార్థులు తాళాలు వేశారు. విద్యాలయ ఆంగ్ల ఉపాధ్యాయిని వ్యవహార శైలిపై నిరసనగా వారు గేటుకు తాళాలు వేశారు. టీచర్‌కు వ్యతిరేకంగా రాసిన ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. టీచర్ జబాపూర్వబి నాగేశ్ విద్యార్థులపై అవమానకరంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 11వ తరగతిలో గల 17 మంది విద్యార్థులను క్లాస్ నుంచి బయటకు పంపారని వారు ఆరోపించారు. గతంలోనూ ఆమైపె పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. అందుకే ప్రధాన గేటుకు తాళాలు వేసి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. కలెక్టర్‌తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ప్రిన్సిపాల్ సెట్టి వెల్లడించారు.

ఆదర్శ విద్యాలయ గేటుకు తాళాలు

ఆదర్శ విద్యాలయ గేటుకు తాళాలు