
సెక్షన్ ఆఫీసర్‌ను చుట్టుముట్టి..
పర్లాకిమిడి: అక్టోబరు రెండున భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి అనేక విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాయఘడ బ్లాక్‌లో పెక్కట, రంగలా సింగి, భన్నడ, బరబ, పరాజీ వంటి పలు గ్రామాల్లో గత పదిహేను రోజులుగా ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. అనేకసార్లు గ్రామస్తులు విద్యుత్ పునరుద్ధరణకు విన్నవించినా టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ అధికారులు స్పందించకపోవడంతో శుక్రవారం పెక్కట గ్రామానికి విచ్చేసిన విద్యుత్ సెక్షన్ ఆఫీసర్‌ను ప్రజలు చుట్టుముట్టి రాత్రి చాలాసేపు గ్రామంలో ఉంచారు. పలు గ్రామాల ప్రజలు జూనియర్ ఇంజినీరు (ఎలక్ట్రికల్) చుట్టుముట్టి నిలదీయడంతో... చివరకు విద్యుత్ రెండు రోజుల్లో పునరుద్ధరణ చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు అక్కడి నుంచి విడిచిపెట్టారు.

సెక్షన్ ఆఫీసర్‌ను చుట్టుముట్టి..