
సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఐఈఈఈ దినోత్సవం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో అంతర్జాతీయ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డేను ఘనంగా ఓపెన్ ఆడిటోరియంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ దేవేంద్రకుమార్ సాహు స్వాగత ఉపన్యాసం ఇవ్వగా, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ ప్రఫుల్ల కుమార్ పండా మాట్లాడారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో ఇటీవల నూతన ఆవిష్కరణలు, పరిశోధన, వివిధ సాఫ్ట్‌వేర్, హార్డువేర్ రంగాల్లో ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ సుప్రియా పట్నాయిక్, విశ్రాంత ఐటీఆర్ (భుభనేశ్వర్) డైరక్టర్ హెచ్‌కే రథ్, డీఆర్‌డీఓ, ఐఐటీ, భుభనేశ్వర్ డాక్టర్ ప్రద్యుత్ కె.బిశ్వాళ్ తదితరులు ఐఈఈఈ పై అనర్గళంగా మాట్లాడారు.