
ఒడిశా ఉత్తరప్రదేశ్
● 208.7 కిలోల గంజాయితో పట్టుబడిన ఉత్తరప్రదేశ్ వాసులు
● రూట్ మార్చి
తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
● గంజాయి తరలిస్తున్న కారు అద్దాలపై ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ ట్యాగ్స్
వయా శ్రీకాకుళం
శ్రీకాకుళం క్రైమ్ : ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఓనరు ఆదేశిస్తాడు.. వీరు పాటిస్తారు. ఎవరి దగ్గరకు వెళ్లాలి.. ఎక్కడ గంజాయి కొనాలి.. ఎలా తిరిగి రావాలి.. చెక్‌పోస్టులు ఉంటే ఎలా తప్పించుకోవాలి.. ఇలా అన్ని ప్లాన్లు ఓనరే వేస్తాడు. అతను చెప్పింది చెప్పినట్లు వీరు పాటిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీరు ఖాకీల నుంచి తప్పించుకోలేకపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, మీరట్‌లకు చెందిన సునీల్ (38), విశాల్ (28)లు ఒడిశాలోని కొరా పుట్ నుంచి టొయోటో కారులో 208.79 కిలోల గంజాయిని చెక్‌పోస్టులు తప్పించి.. రూట్ మార్చి మళ్లించే యత్నంలో చిలకపాలెం వద్ద ఎచ్చెర్ల పోలీ సులకు పట్టుబడ్డారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం విలేకరులకు వివరాలు వెల్లడించారు.
ఎప్పటి నుంచో..
మీరట్‌లోని డౌట్‌లో స్పై హోటల్ నడుపుతున్న గౌర వ్ వద్ద సునీల్, విశాల్‌లు కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఎప్పటి నుంచో వీరు గంజాయి క్రయవిక్రయాల్లో సిద్ధహస్తులు. ఈ క్రమంలో ఒడిశాలోని కొరాపుట్ జిల్లా దంతపురి సమీప లంపటాఫుట్ గ్రామానికి చెందిన సమర మాటం అలియాస్ డొంబురు వద్ద ఈనెల 14న 40 ప్యాకెట్లలో 208.7 కిలోల గంజాయిని తీసుకున్నారు. శ్రీకాకుళం చెక్‌పోస్టులను తప్పించి దారి మళ్లించి విశాఖ చేరేందుకు వీరు టొ యాటో కారులో కొరాపుట్ నుంచి బయల్దేరారు.
కారుపై ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ స్టిక్కర్లు
వీరు ప్రయాణిస్తున్న కారుపై ఢిల్లీ హైకోర్టు బార్ కౌన్సిల్, జాతీయ చిహ్నం గుర్తుతో అడ్వకేట్ 2019, అడ్వకేట్ 2021 స్టిక్కర్లు ఉండటంతో అనుమానం వచ్చి లోపల తనిఖీ చేయగా 40 ప్యాకెట్లలో గంజా యి పట్టుబడింది. వీరు చిలకపాలెం నుంచి విశాఖ చేరి అక్కడి నుంచి విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా నాగపూర్ హైవేకు చేరి అక్కడి నుంచి మీర ట్ వెళ్లి తమ ఓనరుకు అప్పగిస్తామని విచారణలో పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం గంజాయిని వీరికి అందించిన ఒడిశా సమరమాటం, అతనికి సహకరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నారని, మీర ట్ ఓనర్ అయిన గౌరవ్ వద్దకు పోలీసులను పంపించామని, వీరేకాక మరో ముగ్గురిని నిందితులుగా గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.
రూట్ మార్చారిలా..
ఒడిశా కొరాపుట్ నుంచి చత్తీస్‌గఢ్ రాష్ట్ర బోర్డర్ ఆనుకొని ఉన్న సిమిలిగుండ మీదుగా పొత్తంగి వద్ద అడ్డుదోవ తీసుకుని సమీపంలోని ఒడిశా సుంకి చెక్‌పోస్టును తప్పించారు. అక్కడి నుంచి విజయనగరం జిల్లా సాలూరు నుంచి రామభద్రాపురం, రాజాం, పొందూరులు దాటి చిలకపాలెం జంక్షన్ వద్దకు వచ్చి పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. అప్పటికే ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌కు ఈగల్‌టీమ్ సమాచారం ఉండటంతో కారును తనిఖీ చేశారు.

ఒడిశా ఉత్తరప్రదేశ్