
పాఠశాల పరిశీలన
కొరాపుట్: హిందాల్కో ప్రైవేట్ సంస్థ ఆర్థిక సహాయంతో ఎక్స్ బోర్డు స్కూల్‌లో మరమ్మతులు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత ప్రకటించారు. గురువారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ నియెజకవర్గం కన్సారి గుడ గ్రామంలో ప్రభుత్వ స్కూల్‌ను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాడైన బెంచీలు, కుర్చీలను ఎమ్మెల్యేకు విద్యార్థులు చూపించారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. హిందాల్కో సహాయంతో బాగు చేయిస్తామని హామీ ఇచ్చారు.
వైద్యుడి బదిలీని రద్దు చేయాలి
పర్లాకిమిడి: ఆర్.ఉదయగిరి బ్లాక్ రామగిరిలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ బ్రజరాజ్‌కర్‌ను ఉద్దేశపూర్వకంగా పర్లాకిమిడి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ చేశారని, ఆ బదిలీని రద్దు చేయాలని తబార్‌సింగి, మరో రెండు గ్రామాల ప్రజలు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి ఏడీఎం ఫల్గుణి మఝికి గురువారం వినతిని అందజేశారు. డాక్టర్ బ్రజరాస్ కర్ మంచి వైద్యుడని, ఆయన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. రామగిరి సీడీపీఓ, ఇతర సిబ్బంది ఆయనపై అభియోగాలు మోపి ఐదు నెలల జీతం ఇవ్వకుండా చేశారని, చివరకు పర్లాకిమిడి కేంద్ర ఆస్పత్రికి బదిలీ చేశారన్నారు. వెంటనే ఆయన బదిలీని రద్దుచేసి, రామగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ ఫరూల్ పట్వారీపై దర్యాప్తు
రాయగడ: జిల్లా కలెక్టర్‌గా ఇదివరకు విధులు నిర్వహించిన ఫరూల్ పట్వారీపై జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమారావ్ చేసిన ఫిర్యాదు మేరకు దక్షిణాంచల్ ఆర్‌డీసీ సంగ్రామ్ కేసరి మహాపాత్రో దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన బుధవారం రాయగడలో పర్యటించారు. ప్రస్తుత కలెక్టర్ అశుతోష్ కులకర్ణితో చర్చించిన ఆయన ఎస్‌డీసీ (స్పెషల్ డవలప్‌మెంట్ కౌన్సిల్)లో చోటుచేసుకున్న ఆర్థిక కుంభకోణంపై ఆరా తీశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమారావ్‌ను ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. అందుకు సంబంధించి కొన్ని ఫైళ్లను కూడా తనిఖీ చేశారు. ఫరూల్ పట్వారీ రాయగడ కలెక్టర్‌గా విధులు నిర్వహించే సమయంలో వివిధ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన సామాన్లను ఖరీదు చేసే విషయంలో ఆదేశించిన ఫైల్స్‌ను పరిశీలించారు.
కవిటి: మండలంలోని ఎన్‌హెచ్–16 హైవే పై శిలగాం ఫ్లైఓవర్ దాటి న తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి ఆది ఆంధ్ర వీధికి చెందిన వాడపల్లి శ్రీను(39) మృతి చెందాడు. టెక్కలి పట్టణం ఆది ఆంధ్ర వీధికి చెందిన వాడపల్లి శ్రీను ఉదయం టెక్కలి నుంచి తన ద్విచక్రవాహనంపై ఇచ్చాపురం మండలం సంతపేట గ్రామంలో ఉన్న బావమరిది పెండ్ర ముకేష్ ఇంటికి ప్రయాణిస్తున్నాడు. ప్రయాణం మధ్యలో కవిటి మండలం జమేదార్ పుట్టుగ గ్రామం దగ్గరలో ఎన్‌హెచ్ 16 రహదారి పై బండి అదుపు తప్పి హైవే డివైడర్‌ను గుద్దుకుని తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించి ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ విలేకరులకు తెలియజేశారు.

పాఠశాల పరిశీలన

పాఠశాల పరిశీలన

పాఠశాల పరిశీలన